రాష్ట్రంలోని దాదాపు 87 డిగ్రీ కాలేజీల్లో సున్నా ప్రవేశాలు నమోదయ్యాయి. 125 డిగ్రీ కాలేజీల్లో 25 శాతంలోపే ప్రవేశాలు నమోదయ్యాయి. అన్ని డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరిగా అమలుపరుచాలని అధికారులు నిర్ణయించారు. టీఎస్టీఎస్ ఆధ్వర్యంలో బయోమెట్రిక్ మిషన్ల సరఫరాకు చర్యలు తీసుకొంటున్నారు. ఆయా కాలేజీల్లో కనీస విద్యాప్రమాణాలు, సబ్జెక్టు ఫ్యాకల్టీ లేకపోవడం వంటి కారణాలతో ప్రవేశాలు పొందడానికి విద్యార్థులెవ్వరూ ముందుకురాలేదని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిత్తల్ తెలిపారు.