ఒకరితో సహజీవనం…మరోపక్క వ్యభిచారం…రెండు మర్డర్ లకి స్కెచ్ !

Adultery on the other ... Sketch for Two Murders!

తాను సహజీవనం చేస్తున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే గాకుండా ఆమెతో వ్యభిచారం చేయిస్తున్నాడన్న కోపంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. ఇద్దరు భార్యలు, కుమార్తెను కిరాతకంగా చంపిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అక్రమ సంబంధం నేపథ్యంలో మరో హత్య చేశాడు.

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన షేక్‌ అబ్దుల్‌ నిస్సార్‌‌ 2012లో కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇద్దరు భార్యలు, కుమార్తెను దారుణంగా హత్యచేశాడు. ఈ కేసు విచారణ జరుగుతుండగానే బెయిల్‌పై బయటకు వచ్చిన నిస్సార్ సింగరాయకొండ వద్ద కార్ మెకానిక్ షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు.

విశాఖ జిల్లా అరకు ప్రాంతానికి చెందిన మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు. నిస్సార్ వద్ద పనిచేసే షేక్ జిలానీకి స్నేహితుడైన మాధవరెడ్డి(35) తరుచూ వీరి షాపుకు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే నిస్సార్‌ సహజీవనం చేస్తున్న మహిళతో అతడికి పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది.

గతేడాది అక్టోబరులో ఆ మహిళ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. తన ప్రియురాలు వెళ్లిపోవడానికి మాధవరెడ్డే కారణమని, వ్యభిచారం చేయించేందుకు ఆమెను తనకు దూరం చేశాడని నిస్సార్ కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 20వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో మాధవరెడ్డిని సింగరాయకొండలోని మెకానిక్ షాపు దగ్గరికి పిలిచాడు.

ముగ్గురూ అక్కడ మద్యం తాగి పడుకున్నారు. అర్ధరాత్రి వేళ నిద్రలేచిన నిస్సార్, జిలానీ మాధవరెడ్డి తలపై ఇనుపరాడ్‌తో బలంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించి నిందితులను అరెస్ట్ చేయడంతో ఇదే వ్యవహారంలో టంగుటూరుకు చెందిన పైడిరాజు ప్రాణాలతో బయటపడ్డాడు.