ఇరాన్ లో కుప్పకూలిన విమానం

ఇరాన్ లో కుప్పకూలిన విమానం

ఇరాన్ లో పౌర విమానం కుప్పకూలిపోయింది. ఎయిర్ పోర్టు నుంచి టేకప్ తీసుకోగానే విమానం కుప్పకూలిపోయింది. 180 మంది ప్రయాణికులు సిబ్బందితో వెళ్తున్నా ఇరాన్ కు చెందిన పౌర విమనం టెహ్రాన్ ఎయిర్ పోర్ట్ సమీపంలో కుప్పకూలిపోయింది. అయితే సాంకేతిక సమస్యలతో నే ఈ విమానం కూలి పోయినట్లు తెలుస్తోంది. కాగా విమానాన్ని అమెరికానే కూల్చేసిందని ఆరోపిస్తోంది ఇరాన్ . అమెరికా కావాలనే యుద్ధాన్ని కోరుకుంటుందని ఆ దేశం ఫలితాన్ని అనుభవించక తప్పదని హెచ్చరిస్తుంది ఇరాన్ . అయితే విమానం కూలడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని తమ రాడార్లు విమానం గమనాన్ని విశ్లేషిస్తున్నాయి అని అమెరికా అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఈ విమానంలో ఉన్న 180 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది ప్రాణాలతో ఉన్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇకపోతే గత కొన్ని రోజులుగా అగ్ర రాజ్యాలైన ఇరాన్ అమెరికా మధ్య గత కొన్ని రోజులుగా వివాదం రగులుతున్న విషయం తెలిసిందే. ఇరాన్ అమెరికా ఒకదానిపై ఒకటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇక తాజాగా ఇరాన్ అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించారు. కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షుడు ఇరాన్ అధ్యక్షుడు మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. అయితే అగ్రరాజ్యాల అధ్యక్షుల మధ్య మాటలు వివాదం కాస్త ముదిరి ఎప్పుడు ఏం జరుగుతుందో అని మిగతా దేశాలు కూడా భయపడుతున్నాయి. ఓ వైపు యుద్ధం తప్పదని ఇరాన్ హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది.

అంతేకాకుండా గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని చంపిన వారికి ఏకంగా 80 బిలియన్ల డాలర్లు బహుమతి ఇస్తామంటూ ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దీంతో అగ్ర రాజ్యాలైన అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది . కాగా ఈ వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఇరాన్ లోని అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేసిన కొన్ని గంటలకే ఇరాన్ లో ఓ విమానం కుప్పకూలడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.