రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇవ్వడంతో సినిమాకు ఓకే చెప్పిన లేడీ అమితాబ్

రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇవ్వడంతో సినిమాకు ఓకే చెప్పిన లేడీ అమితాబ్

టాలీవుడ్ లో ఒకప్పుడు తన అంద చందాలతో పాటు మంచి నటన ప్రదర్శించి అందరి మనసు దోచిన నటి విజయశాంతి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించిన లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుంది. వరుసగా అదే తరహా సినిమాల్లో నటించడం వల్ల జనాలకు బోర్ కొట్టేయడంతో ఆమె సినిమాలు పరాజయాలు అయ్యాయి. అయితే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు విజయశాంతి. మొదట బీజేపీలో చేరిన ఆమె తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు.. ఆ తర్వాత పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేశారు. ఆ సమయంలో విజయశాంతి మెదక్ ఎంపీగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.

ఇక తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కి విజయశాంతికి అభిప్రాయ భేదాలు రావడంతో ఆమె కాంగ్రేస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక జంటగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో ఓ కీలక పాత్రలో పోషిస్తున్నారు విజయశాంతి. అయితే రాజకీయాల్లో ఉండగా ఆమె సినిమాల్లో నటించరని అందరూ భావించారు. అయితే అనీల్ రావిపూడి ఆమెకు కథ వినిపించి..మొత్తానికి సినిమాలో నటించేలా ఒప్పించారు. తాజాగా సరిలేరు నీకెవ్వరు మూవీతో పదమూడేళ్ల గ్యాప్ ను వదిలేసి.. రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతికి భారీ రెమ్యునరేషన్ ముట్టచెప్పినట్లుగా టాలీవుడ్ టాక్.

ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన రష్మికకు మించిన రాములమ్మకు ముట్టినట్లుగా తెలుస్తోంది. దాదాపు రూ.1.5 కోట్లు ఇచ్చినట్లుగా చెబుతోంది. ఈ సినిమాలో నటించాలని దర్శకుడు అనిల్ రావిపూడి కోరినప్పుడు ఆమె విముఖత చూపించిన విషయం తెలిసిందే. అయితే రెమ్యూనరేషన్ ఆమెకు ఎక్కువగా ఇవ్వడంతో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది..అందుకే ఆ స్థాయి రెమ్యూనరేషన్ ఇవ్వడం జరిగిందని టాలీవుడ్ టాక్. ఏది ఏమైనా అప్పుడు.. ఇప్పుడు లేడీ అమితాబ్ కి ఎదురే లేదు అనిపించుకుంటుంది.