వర్షం ఎఫెక్ట్..52 విమానాలు రద్దు

aeroplanes cancelled due to rain

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడటంతో రైలు, విమానయాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతుంది. విమాన రాకపోకలు స్తంభించిపోవడంతో చాలా మంది ప్రయాణికులు ముంబై ఎయిర్ పోర్టులోనే నిలిచిపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 52 విమాన సర్వీసులు రద్దు చేయగా..54 విమానాలను దారిమళ్లించినట్లు ముంబై ఎయిర్ పోర్టు ప్రతినిధి ఒకరు తెలిపారు. ముంబై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువనున్నాయని ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ముంబై సిటీ, ముంబై స‌బ‌ర్బ‌న్‌, థానే జిల్లాల్లో ఇవాళ ప్ర‌భుత్వ స్కూళ్లు, కార్యాల‌యాల‌కు ఇప్పటికే సెలవు ప్ర‌క‌టించారు.