నేను విన్నాను.. నేను ఉన్నానంటూ సీఎం అయ్యి…అన్నే బాబే అంటున్నావా ?

says i heard and i will be here

గత ప్రభుత్వం ఏపీని అన్ని విధాలా భ్రష్టు పట్టించిందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తుండడం పట్ల మాజీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పనిగట్టుకుని బురద చల్లినంత మాత్రాన వాస్తవాలు మరుగున పడిపోవని స్పష్టం చేశారు. 2018-19 మధ్యకాలంలో రికార్డు స్థాయిలో ఏపీ రూ.20,746 కోట్ల జీఎస్టీ వసూళ్లను సాధించిందని, దేశంలోనే అత్యధికంగా 28 శాతం పెరుగుదలను నమోదు చేసిందని లోకేశ్ ట్వీట్ చేశారు. గత ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వచ్చిన రాష్ట్రం సాధించిన జీఎస్టీ ఘనతల వార్త క్లిప్పింగ్ ను కూడా లోకేశ్ తన ట్వీట్ లో పొందుపరిచారు. అలాగే ఏపీలో రైతులు విత్తనాల కోసం గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. వైకాపా అధికారంలో ఉంద‌ని మ‌రిచిపోయారా? అని ప్రశ్నించారు. ‘విత్త‌నాలో జ‌గ‌న్ ప్ర‌భో’ అంటూ రైతులు గ‌గ్గోలు పెడుతుంటే, గత పాలకుడు చంద్ర‌బాబు వ‌ల్లే రైతులకు విత్త‌నాలు ఇవ్వ‌లేక‌పోతున్నామని అంటున్నారని విమర్శించారు. ఒక‌టో తారీఖున వచ్చే పింఛ‌న్ రాలేదేమ‌ని వృద్ధులు నిల‌దీస్తుంటే గ‌త ప్ర‌భుత్వం వ‌ల్లే ఆల‌స్య‌మైంద‌ని స‌మాధానం ఇవ్వడం కరెక్టు కాదని అన్నారు. ‘నేను విన్నాను.. నేను ఉన్నానంటూ..  సీఎం అయ్యి, పాలన చేతకాక, ఇప్పుడు చంద్ర‌బాబే వింటాడు, చంద్ర‌బాబే ఉంటాడు’ అని అంటున్నారని, ఏపీలో అధికారం వెల‌గ‌బెడుతోంది వైసీపీనా? టీడీపీనా? అని ప్రశ్నించారు.