Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికాకు ఆఫ్ఘాన్ తాలిబన్ సంస్థ తీవ్ర హెచ్చరికలు చేసింది. అమెరికాకు ఆఫ్ఘాన్ ఓ శ్మశానంగా మారుతుందని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ..ఆఫ్ఘనిస్థాన్ పై రిపబ్లికన్ ప్రభుత్వ వైఖరిని ప్రకటించారు. ఆఫ్ఘాన్ కు అమెరికా మరిన్ని బలగాలను పంపనుందని చెప్పారు. ఎంతమంది బలగాలను పంపిస్తారనేదానిపై ట్రంప్ స్పష్టంగా ప్రకటన ఇవ్వకపోయినా…దాదాపు 3,900 మందికి పైగా సైనికులను ఆఫ్ఘాన్ కు పంపించాలని వైట్ హౌస్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు రక్షణశాఖకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ ప్రకటనపై తాలిబన్ సంస్థ తీవ్రంగా స్పందించింది.
ఆప్ఘన్ నుంచి అమెరికా తన దళాలను వెనక్కి పిలవకపోతే…త్వరలోనే అమెరికాకు ఆ దేశం శ్మశానంలా మారిపోతుందని తాలిబన్ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ఓ ప్రకటనలో హెచ్చరించాడు. యుద్ధాన్ని కొనసాగించాలనే నిర్ణయాన్ని వదులుకుని అమెరికా వెళ్లిపోతే మంచిదని సలహా కూడా ఇచ్చాడు. ఆఫ్ఘనిస్థాన్ లో 16 ఏళ్ల నుంచి అమెరికా సైనికులు ఉంటున్నారు. సెప్టెంబరు 11 దాడుల తర్వాత ఒసామా బిన్ లాడెన్ కోసం తాలిబన్లపై యుద్ధం ప్రకటించి పెద్ద సంఖ్యలో ఆల్ ఖైదా ఉగ్రవాదులను హతమార్చిన అమెరికా అప్పటినుంచి అక్కడే తిష్ట వేసింది. ఏటా తమ దేశం నుంచి ఆఫ్ఘాన్ కు సైనికులను, ఆయుధాలను తరలిస్తూనే ఉంది.
ఆఫ్ఘనిస్థాన్ లో నడుస్తోంది అమెరికాకు కీలుబొమ్మగా వ్యవహరించే ప్రభుత్వమే అని ఆరోపణలున్నాయి. ఆఫ్ఘాన్ సొంతంగా పాలించుకుంటున్నట్టు కనిపిస్తున్నా…ఆర్థిక,రక్షణ, విదేశాంగ …ఇలా కీలక శాఖలకు సంబంధించిన నిర్ణయాలన్నీ అమెరికా ఆదేశం ప్రకారమే జరుగుతుంటాయి. ఇది తాలిబన్లకు నచ్చటం లేదు. ఆప్ఘాన్ లోని కీలక స్థావరాల్లో పాగా వేసుకున్న తాలిబన్లు ఎన్నోసార్లు అమెరికా సైనికుల లక్ష్యంగా దాడులు చేశారు. ఎందరో అమెరికా సైనికులు తాలిబన్ల దాడిలో మృతిచెందారు. ఆఫ్గాన్ లో అమెరికా ఊసే లేకుండా చేయాలన్నది తాలిబన్ల లక్ష్యం కాగా, తాలిబన్లను ప్రపంచ పటం నుంచే రూపుమాపాలన్నది అమెరికా ఉద్దేశం
మరిన్ని వార్తలు: