తూర్పు అఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందగా, నలుగురు గాయపడినట్లు తాలిబన్లు తెలిపారు. అయితే ఈ తూర్పు నాగర్‌హర్ ప్రావిన్స్‌లోని లాలోపర్ జిల్లాలో ఆహార పదార్థాలను విక్రయిస్తున్న బండి పాత పేలని మోర్టార్ షెల్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని తాలిబన్ల గవర్నర్ కార్యాలయం వెల్లడించింది.
తాలిబాన్ ప్రత్యర్థుల అయిన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అఫ్గనిస్తాన్‌ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ కొత్త పాలకులను లక్ష్యంగా చేసుకుని పలు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేగాక దశాబ్దాల కాలంగా యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొన్న అఫ్గనిస్తాన్‌లో పేలని ల్యాండ్ మైన్స్, ఇతర ఆయుధాలు కోకొల్లలు. అయితే అవి ఎప్పుడైన పేలితే మాత్రం పిల్లలే ఆ ప్రమాదానికి బాధితులవడం బాధాకరం.