పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు వారాల పాటు జైలులో ఉన్న రాజ్‌కుంద్రా బుధవారం బైయిలుపై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో శిల్పాశెట్టి తన షూటింగ్లో తిరిగి పాల్గొన్నట్లు సమాచారం. శిల్పా సూపర్ డ్యాన్సర్ 4 అనే రియాలిటీ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తదుపరి ఎపిసోడ్లో శిల్పాశెట్టి పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆమె క్యారవాన్ నుంచి బయటకు వచ్చి సెట్లోకి నడుచుకుంటూ వెళుతున్న వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. కాగా భర్త అరెస్టుతో గత మూడు వారాలుగా ఈ షోకు శిల్పా హాజరు కానీ విషయం తెలిసిందే.
దీంతో ఆమె స్థానంలో సంగీత బిజ్లానీ, జాకీ ష్రాఫ్, టెరెన్స్ లూయిస్, సోనాలి బింద్రే, మౌషుమి ఛటర్జీ, కరిష్మా కపూర్, జెనీలియా దంపతులు అతిథులుగా వచ్చారు. నెక్ట్ జరిగే ఎపిసోడ్లో ఇండియన్ ఐడల్ 12 విజేత పవణ్‌దీప్ రాజన్, ఇతర ఫైనలిస్టులు.. షణ్ముక ప్రియ, అరుణిత కంజిలాల్, సాయిలీ కాంబ్లే, మొహమ్మద్ డానిష్, నిహాల్ టౌరో భాగం కానున్నారు. ఈ నేపథ్యంలో శిల్పా తిరిగి ఈ సూపర్ డ్యాన్సర్ 4 సెట్‌కు రాగానే డ్యాన్సర్, జడ్జీలు ఆమెను ఆప్యాయంగా స్వాగతించారు. ఇక వారి అభిమానం, ఆపాయ్యత చూసి శిల్పా భావోద్వేగానికి లోనయ్యారట. దీనికి సంబంధించిన ప్రోమో త్వరలోనే సోనీ టీవీ విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా శిల్పా సహా-నిర్ణేత అనురాగ్ బసు ఆమె గైర్హాజరుపై స్పందిస్తూ తమ టీం ఆమెను చాలా మిస్ అవుతున్నామని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా శిల్పా 2016 నుంచి సూపర్ డ్యాన్స్ 4 షోకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు.