Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంక్రాంతి సందర్బంగా ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రం 150 కోట్లను సునాయాసంగా వసూళ్లు చేస్తుందని అంతా భావించారు. పవన్ ఫ్యాన్స్ 200 కోట్లకు పైగా అంటూ అంచనా వేశారు. కాని సినిమా ఫ్లాప్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్లకు కోట్లల్లో నష్టం ఖాయం అని భావించారు. అయితే సంక్రాంతి సీజన్ అవ్వడంతో అజ్ఞాతవాసి చిత్రంకు కాస్త పర్వాలేదు అన్నట్లుగా కలెక్షన్స్ వచ్చాయి. అన్ సీజన్లో మొదటి వారంలో ఈ చిత్రం కేవలం 25 కోట్ల గ్రాస్ కూడా సాధించలేక పోయేది. కాని సంక్రాంతి పండగ అవ్వడంతో పాటు, మరే సినిమాలు పెద్దవి లేకపోవడంతో పవన్ కళ్యాణ్ స్టామినాతో ఏకంగా 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసింది.
పవన్ అజ్ఞాతవాసి చిత్రం మొదటి వారంలో 39.15 కోట్ల షేర్‌ను వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ స్థాయి కలెక్షన్స్‌ను సినిమా విడుదలైన రోజు ఊహించలేదు అని, ఫ్లాప్ టాక్ రావడంతో కనీసం కలెక్షన్స్ కూడా రావని భావించినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. సంక్రాంతి పండగ అవ్వడంతో ఏదో ఒక సినిమా చూసేద్దాం అనుకున్న వారు అజ్ఞాతవాసిని ఎంపిక చేసుకున్నారని, దాంతో ఊహించని విధంగా ఫ్లాప్ సినిమాకు ఏకంగా 40 కోట్ల షేర్ మొదటి వారంలోనే వచ్చిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా కలెక్షన్స్ ఇంకా నిలకడగా వస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మరో 25 కోట్ల వరకు కలెక్షన్స్ ఈ చిత్రం సాధించే అవకాశాలున్నాయని సమాచారం అందుతుంది. మొత్తంగా డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోకుండా సంక్రాంతి సీజన్ కాపాడినదని చెప్పుకోవచ్చు.