అజ్ఞాతవాసి టీజర్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం దాదాపు మూడు నాలుగు నెలల క్రితమే విడుదల అవుతుందంటూ వార్తలు వచ్చాయి. అప్పటి నుండి కూడా సినిమా అదుగో ఇదుగో అంటూ జరుపుతూ వచ్చారు. ఎట్టకేలకు సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. సంక్రాంతి సందర్బంగా జనవరిలో విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతన్నాయి. ఇంకా 40 రోజులు ఉండగానే చిత్రీకరణ పూర్తి అయిన కారణంగా సినిమా ఖచ్చితంగా విడుదల వాయిదా పడదని, అనుకున్న సమయానికి విడుదల అవుతుందని చెబుతున్నారు.

Pawan Kalyan Agnathavasi Movie shooting finished

 

సినిమా చిత్రీకరణ పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. వారణాసిలో చివరి షెడ్యూల్‌ పూర్తి చేసినట్లుగా నిర్మాత ప్రకటించాడు. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. క్రిస్మస్‌ కానుకగా టీజర్‌ను, కొత్త సంవత్సరంకు ట్రైలర్‌ను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది. పవన్‌ 25వ చిత్రం అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని దర్శకుడు త్రివిక్రమ్‌ ధీమా ఉన్నాడు. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా సమాచారం అందుతుంది. కీర్తి సురేష్‌, అను ఎమాన్యూల్‌లు హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా భారీ ఎత్తున అంచనాలను కలిగి ఉంది. విడుదలకు ముందే 100 కోట్ల బిజినెస్‌ను ఈ చిత్రం చేసినట్లుగా సమాచారం అందుతుంది.