జయ స్థానంలో విశాల్‌..?

hero vishal may contestant rk nagar by - election

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తమిళ హీరోలు రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌లు రాజకీయ అరంగేట్రం గురించి మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి రాజకీయ ఎంట్రీ ఏమో కాని, వీరిద్దరి కంటే ముందే విశాల్‌ రాజకీయ అరంగేట్రం చేసేలా కనిపిస్తున్నాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నేపథ్యంలో ఆర్కే నగర్‌ స్థానంకు ఉప ఎన్నిక వచ్చింది. ఆ స్థానంలో పోటీ చేసేందుకు విశాల్‌ ఆసక్తిని కనబర్చుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. గతంలో జరగాల్సిన ఈ ఉప ఎన్నిక భారీ ఎత్తున డబ్బు పంచుతున్నారు అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేయడం జరిగింది.

vishal

తాజాగా ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికపై తమిళనాడుతో పాటు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ మరియు బీజేపీ కూడా ఈ స్థానంను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విశాల్‌ ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సామాజిక విషయాల పట్ల ఎక్కువ శ్రద్ద చూపించే విశాల్‌ ఆ మద్య వరదలు వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా సహాయక చర్యల్లో పాల్గొన్నాడు. దాంతో ఈసారి ఆర్కే నగర్‌ నుండి పోటీ చేస్తే విశాల్‌కు లాభం చేకూరే అవకాశం ఉంది. ఈ వార్తలపై విశాల్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.