కొత్త లుక్ లో బాలయ్య

nandamuri-balakrishna-jai-s

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి బాలకృష్ణ ఇటీవలే ‘పైసావసూల్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా బాలయ్య కొత్త సినిమా ‘జైసింహా’ను చేస్తున్న విషయం తెల్సిందే. తమిళ దర్శకుడు రవికుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఏమాత్రం అంచనాలు లేవు. అయితే ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ మరియు తాజాగా విడుదలైన పోస్టర్‌తో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌ రచ్చ రచ్చ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. బాలయ్య లుక్‌ మరీ అరాచకంగా ఉందని, పది సంవత్సరాల క్రితం బాలయ్య ఎలా కనిపించాడో, ఇప్పుడు ‘జైసింహా’ చిత్రంలో అలాగే కనిపిస్తున్నాడని, మేకప్‌తో మైమరపించడం బాగుందని నందమూరి అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంను సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇంకా హరిప్రియ మరియు నటాషాలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. బాలయ్య లుక్‌ చూస్తుంటే సినిమా తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకంగా ఉందని నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

balakrishna-jai-simha-lates