Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. సాధారణంగా సినిమా విడుదలయ్యే సమయంలోనో, ఆడియో రిలీజ్ టైంలనో లేదంటే టీజర్ లాంచ్ టైంలోనో సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లు చూస్తుంటాం. కానీ ఓ సినిమా టీజర్ తేదీ ఎప్పుడంటూ, ఎలా ఉంటుందంటూ హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అయిన సినిమాగా అజ్ఞాతవాసి రికార్డు క్రియేట్ చేసింది. అజ్ఞాతవాసి టీజర్ డే అనే హ్యాష్ ట్యాగ్ తో ఇండియా ట్రెండ్స్ లో నాలుగోస్థానంలో నిలిచింది.
ఇక శనివారం విడుదలయిన టీజర్ టాలీవుడ్ లో అత్యధిక మంది లైక్ చేసిన టీజర్ గా నిలిచింది. మధురాపురి సదన, మృదువదన అనే కీర్తనతో టీజర్ మొదలయింది. ఎప్పటిలానే పవన్ కళ్యాణ్ లుక్, హావభావాలు హైలెట్ గా నిలిచాయి. అతని చర్యలు ఊహాతీతం వర్మా అనే డైలాగ్ ను మురళీశర్మతో చెప్పించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 19న ఆడియో విడుదల కానుంది. జనవరి 10న సంక్రాంతి కానుకగా అజ్ఞాతవాసి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.