జూబ్లీహిల్స్ లో KCR పాలిటిక్స్ షురూ…చిన్న శ్రీశైలం యాదవ్ అరెస్ట్…!

AIMIM Jubileehills Rebal Candidate Naveen Yadav Father Arrest

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గతంలో పార్టీలో వుండి సీటు ఆశించి భంగపడి రెబల్ గా బరిలోకి దిగిన అభ్యర్థులను ఇంకా బుజ్జగించే ప్రయత్నాల్లో ముఖ్య పార్టీలున్నాయి. ఇప్పటివరకు సామ దాన ఉపాయాలను ప్రయోగించిన పార్టీలు ఇప్పుడు దండోపాయాన్ని ప్రయోగిస్తున్నారు. దీంటో భాగంగా ఎంఐఎం రెబల్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను టీఆర్ఎస్ కు సపోర్ట్ చేయమని బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో జూబ్లీహిల్స్ లోని అతడి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ అరెస్ట్ తో నవీన్ యాదవ్ కుటుంబంతో పాటు అతడి అనుచరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయకుంటే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని గతంలో బెదిరించారని అయినా తాము వినకపోవడంతో ఇలా కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తున్నట్లు వారు తెలిపారు. శ్రీశైలం యాదవ్ ను అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్లిన టాస్క్ పోర్స్ పోలీసులను కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అయినా పోలీసులు అతన్ని సికింద్రబాద్ లోని టాస్క్ ఫోర్స్ కార్యలయనికి తరలించారు. ఈ అరెస్ట్ గురించి తెలుసుకున్న నవీన్ యాదవ్ అనుచరులు, సపోర్టర్లు అతడి ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Naveen-Yadav-Father-Arrest
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలను తోసిరాజని తెలుగుదేశం గెలుచుకున్న జూబ్లిహిల్స్‌ స్థానం ఈ సారి కూటమి ఖాతాలోకి వస్తుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తుంది. సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సైకిల్‌ దిగి కారు ఎక్కడంతో క్యాడర్‌ ఆయనతో వెళ్లిందా లేక పార్టీతోనే ఉందా అనేది ఈ ఎన్నికతో తేలనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్‌ 50,898 ఓట్లు సంపాదించగా, ఎంఐఎం అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ 41,656 ఓట్లు సాధించారు. మైనార్టీలు తమతో ఉంటారనే చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి కేవలం 33,642 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. అధికారంలోకి వచ్చిన ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగిన మురళిగౌడ్‌ కేవలం 18,436 ఓట్లకే పరిమితమయ్యారు. ప్రధాన పార్టీలు ఏవీ కూడా టీడీపీ దెబ్బకి రెండో స్థానంలో కూడా నిలవలేదు. దాదాపు 25.4 శాతం ఓట్లు ఎంఐఎం అభ్యర్థి తరువాతి స్థానంలో నిలిచారు. దీంతో ఎలా అయినా నవీన్ యాదవ్ ను కలుపుకుని మాగంటిని గెలిపించుకునేందుకే ఈ కుట్రలు చేస్తోందని వారు భావిస్తున్నారు.

AIMIM-Jubileehills-Rebal-Ca