దారుణం: తప్ప తాగి విమానంలో ఆమె ఎదుట మూత్రం…!

Air India Passenger Fined For Urinating In Flight

తప్పతాగి విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడు తన సహ ప్రయాణికురాలిపట్ల దారుణంగా వ్యవహరించాడు. ఆమె ముందే ప్యాంటు విప్పి ఆమె సీటు మీద మూత్రం పోశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో చోటుచేసుకుంది. దీని పై బాధితురాలి కూతురు సదరు మంత్రికి ఫిర్యాదు చేసింది. ఆమె ఈ ఉదంతం అంతా వివరిస్తూ కొన్ని ట్వీట్లు కూడా చేసింది. ఆమె ట్వీట్ ప్రకారం శుక్రవారం అమెరికా జేఎఫ్‌కే విమానాశ్రయం నుంచి బయల్దేరిన మీ విమానం ఏఐ102లో మా అమ్మకు దారుణ అనుభవం ఎదురైంది.

flight-air-india

మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు తన ప్యాంటు విప్పి ఆమె కూర్చున్న సీటుపై మూత్రం పోశాడు! ఒంటరిగా ప్రయాణిస్తున్న మా అమ్మ ఇది చూసి హతాశురాలైంది. దీనిపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా, ఈ ఘటనపై తగు చర్యలు సత్వరమే తీసుకోవాలని లేదంటే ఇలాంటి వారు రెచ్చిపోతారు’ అంటూ ట్విటర్ లో కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా దృష్టికి తీసుకెళ్లింది. అయన వెంటనే స్పందించి.. ఇలాంటి భయంకరమైన పరిస్థితి మీ తల్లిగారికి ఎదురవడం చాలా దురదృష్టకర ఈ ఘటనపై విచారణకు ఆదేశించి చర్యలు తీయూసుకుంటామని ఆమెకు బదులిచ్చారు.

air-india-flight