మేము న‌మ‌స్క‌రించ‌డానికి మాత్ర‌మే చేతులు ఎత్తుతాము

Air India trolls IndiGo but deletes tweets later photos go viral

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వ్యాపారంలో పోటీ స‌హజం. అన్ని వ్యాపార‌సంస్థ‌లు త‌మ ప్ర‌త్య‌ర్థుల‌పై వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా విమ‌ర్శ‌లు చేస్తుంటాయి. త‌మ‌కు, ప్ర‌త్య‌ర్థి కంపెనీకి గ‌ల తేడాను వివ‌రిస్తూ ప్ర‌క‌ట‌న‌లు రూపొందిస్తుంటాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్య‌ర్థిపై పై చేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాయి. ఇక త‌మ‌కు పోటీగా ఉండే కంపెనీ ఏద‌న్నా వివాదంలో చిక్కుకుందంటే…ప్ర‌త్య‌ర్థి కంపెనీ ఆ వివాదాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునేదాకా నిద్ర‌పోదు. ఎయిరిండియా ఇప్పుడు అదే ప‌నిచేస్తోంది.

indigo

ఓ ప్రయాణికుణ్ని చావ‌బాది దేశ‌వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఎయిర్ ఇండియా సెటైర్లు వేయ‌డం నెట్ లో వైర‌ల్ గా మారింది. త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో ఎయిరిండియా ఇండిగో వ్య‌వ‌హార‌శైలిని ప‌రోక్షంగా విమ‌ర్శిస్తూ రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. మొద‌టి దాంట్లో ఓ మ‌హారాజు రెండు చేతులు జోడించి న‌మ‌స్క‌రిస్తున్నాడు. పైన వుయ్ రైజ్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ టు సే న‌మ‌స్తే ..మేము న‌మ‌స్క‌రించ‌డానికి మాత్ర‌మే మా చేతులు ఎత్తుతాము అని కామెంట్ పెట్టింది.

indigo

రెండో ఫొటోలో అన్ బీట‌బుల్ స‌ర్వీస్ అని ఆంగ్లంలో ఉన్న ఫొటోలో బీట్ అన్న ప‌దాన్ని హైలెట్ చేసింది. ఎయిరిండియా అలా ఈ ట్వీట్లు పోస్ట్ చేసిందో లేదో అలా వైర‌ల్ గా మారిపోయాయి. చాలామంది నెటిజ‌న్లు, రీట్వీట్లు, షేర్లు చేశారు. ప‌నిలో ప‌నిగా నెటిజ‌న్లు గ‌తంలో ఎయిరిండియాలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్తావిస్తూ..ఆగ్ర‌హాన్ని వ్య‌క్తంచేసే స‌రికి ఎయిర్ ఇండియా త‌మ ట్వీట్ల‌ను తొలిగించింది. ఈ ఫొటోల‌ను తాము పోస్ట్ చేయ‌లేద‌ని వెల్ల‌డించింది. మ‌రోవైపు ప్ర‌యాణికుడితో దారుణంగా ప్ర‌వ‌ర్తించినందుకు గానూ ఇండిగోను నిషేధించాల‌న్న డిమాండ్ నెటిజ‌న్ల నుంచి విన‌ప‌డుతోంది. దీనిపై పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు ద‌ర్యాప్తుకు ఆదేశించారు.

air-india-and-indigo