Posted [relativedate]
జియో దెబ్బకు కుదేలైన దేశంలోని టెలికామ్ అగ్ర దిగ్గజం ఎయిర్టెల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇక అన్లిమిటెడ్ ఆఫర్లు ప్రకటించక తప్పదని ఎయిర్టెల్ కొంత ఆలస్యంగానైనా తెలుసుకుంది. దీంతో గురువారం రెండు కొత్త ప్రీపెయిడ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్స్‌ను ఎయిర్టెల్ ప్రకటించింది. 345 రూపాయలతో రీచార్జ్ చేయించుకుంటే 28రోజుల వరకూ ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చని ఎయిర్టెల్ ప్రకటించింది. 1జీబీ 4జీ డేటా ఉచితంగా కూడా ఇస్తున్నట్లు తెలిపింది. 145 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 28రోజుల పాటు ఎయిర్టెల్ టూ ఎయిర్టెల్ ఉచిత కాల్స్ చేసుకోవచ్చని, 300 ఎంబీ 4జీ డేటా వస్తుందని టెలికాం దిగ్గజం ప్రకటించింది. రిలయన్స్ జియో వెల్కమ్ ఆఫర్‌ను మరో మూడు నెలల పాటు పొడిగించడంతో ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకుంది.