టెలికాం రంగంలో ఆపరేటర్ల యుద్ధం మరింత ముదిరింది. ఇటీవలి కాలంలో ఎయిర్ టెల్, జియోలు పోటాపోటీగా ప్లాన్లు ప్రకటిస్తున్నాయి. జియో తన 98 రూపాయల ప్యాక్ మీద 28 రోజుల వ్యాలిడిటీతో 2 జీబీ నెట్ ని అందిస్తుండగా దానిని దెబ్బ కోట్టేందుకు ఇటీవల ప్రకటించిన రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎయిర్టెల్ మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఈ ప్లాన్‌పై గతంలో 28 రోజుల కాలానికి ఒక జిబి డేటాను ఆఫర్ చేసింది. ఇప్పుడు దీన్ని రెండు జీబీకి పెంచింది. అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోజుకు 100 చొప్పున ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
అలాగే తన కస్టమర్ల కోసం ఎయిర్ టెల్ రూ.597 రీచార్జ్ ప్లాన్ ను ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 168రోజులు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. డేటా విషయానికొస్తే 168 రోజుల వరకు 10 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఈ ఉచిత డేటా పరిమితి ముగిస్తే కస్టమర్లు డేటా టాపప్ వేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ డేటా వినియోగించే వారు, దీర్ఘకాలం వ్యాలిడిటీని కోరుకునే కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చిన పథకంగా అని చెప్పవచ్చు. అయితే, ఈ ప్లాన్ ప్రస్తుతానికి కొన్ని సర్కిళ్లలోనే అందుబాటులోకి వచ్చినట్టు సమాచారం. ఎయిర్ టెల్ లో దీర్ఘకాలం వ్యాలిడిటీతో కూడిన మరో ప్లాన్ రూ.995 కూడా ఉంది. దీని వ్యాలిడిటీ ఆరు నెలలు. కాల్స్ తోపాటు రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. కాకపోతే నెలకు ఒక జీబీ డేటా మాత్రమే ఉచితంగా లభిస్తుంది.