మళ్ళీ మంచి కథతో వస్తాను

మళ్ళీ మంచి కథతో వస్తాను

ఆర్‌ఎక్స్‌ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహా సముద్రం’. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలు, అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్‌ అయిన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు తమ అసంతృప్తిని సోషల్‌మీడియా ద్వారా డైరెక్టర్‌ భూపతికి తెలిపారు.

తాజాగా పవన్‌రెడ్డి అనే ట్విట్టర్‌ యూజర్‌..మహాసముద్రం ఏంటి అన్నా అలా తీశావ్‌? చాలా ఎక్స్‌పెక్ట్‌ చేశా అంటూ ట్వీట్‌ చేశాడు. దీనికి స్పందించిన అజయ్‌భూపతి.. మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. నెక్ట్స్‌ టైం మంచి కథతో వస్తాను అని పేర్కొన్నాడు. ప్రస్తుతం అజయ్‌ భూపతి చేసిన ఈ ట్వీట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.