డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఒకప్పుడు ఎంతో మంది యువ హీరోకు లైఫ్ ఇచ్చాడు. ప్రస్తుతం స్టార్స్‌గా వెలుగు వెలుగుతున్న వారితో పలు చిత్రాలు చేసి మంచి విజయాలను దక్కించుకున్నాడు. ఇంతటి సూపర్ హిట్ దర్శకుడు అయిన పూరి జగన్నాద్ తన కొడుకుకు మాత్రం సక్సెస్‌ను తెచ్చి పెట్టడంలో విఫలం అయ్యాడు. పూరి తనయుడు ఆకాష్ చిన్నప్పటి నుండే సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నాడు. బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆకాష్ ‘మెహబూబా’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం ఫ్లాప్ అయ్యింది. పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం కనీసం వారం రోజులు కూడా ఆడలేదు. పూరి ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి లో కనీసం 25 శాతం అయినా రికవరీ కాలేదు. దాంతో పూరి ఆర్థికంగా కూడా చితికి పోయాడు.
మెహబూబా సమయంలోనే ఆకాష్‌తో వెంటనే మరో సినిమాను చేయబోతున్నట్లుగా పూరి ప్రకటించాడు. కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆకాష్‌తో మరో సినిమా అసంభవం అని తేలిపోయింది. పూరి దర్శకత్వంలో సినిమా అంటే ఏ ఒక్క నిర్మాత కూడా ముందుకు రావడం లేదు. దాంతో కొడుకుతో మరో సినిమా ఆలోచనను పూరి వాయిదా వేసుకున్నాడు. ఆకాష్ రెండవ సినిమాకు కాస్త టైం పట్టే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అనూహ్యంగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ దర్శకత్వంలో పూరి ఆకాష్ హీరోగా రెండవ సినిమా ప్రారంభం కాబోతుంది. పూరికి సన్నిహితుడు అయిన ఒక బిజినెస్ మెన్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. శ్రీకాంత్ దర్శకత్వంలో ఒక పూర్తి స్థాయి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆకాష్ రెండవ మూవీ ఉంటుందని తెలుస్తోంది. రెండవ చిత్రంతో అయినా ఆకాష్‌కు హీరోగా సక్సెస్ దక్కుతుందో చూడాలి.