Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినీ నటి రంజిత తో శృంగార కార్యకలాపాలు నెరుపుతూ కెమెరా కళ్ళకి చిక్కిన నిత్యానంద లీలల్ని యావత్ ప్రపంచం చూసింది. ఇది ఆయన గారి తీరుకు ప్రత్యక్ష సాక్ష్యం అయితే ఇక పరోక్షంగా నిత్యానంద మీద ఆరోపణలకు కొదవే లేదు. వ్యక్తిగతంగా ఓ రేప్ కేసు, ఆయన నడుపుతున్న ఫౌండేషన్ మీద ఏడెనిమిది అవినీతి, అక్రమాస్తుల కేసులు, అమెరికా నుంచి అక్రమంగా నిధుల సేకరణ వంటివి అందరికీ తెలిసిన బాగోతమే. ఇంత చేసినా నిత్యానంద ఉత్తముడైన స్వామీజీ యే నట. డేరా బాబా అరాచకాలు బయటపడ్డాక ఇటీవల అఖిల భారత అఖారా పరిషత్ కొందరు బాబాల్ని నకిలీలు అంటూ ఓ జాబితా ప్రకటించింది. మొత్తం 14 మంది బాబాలు ఆ లిస్ట్ లో వున్నారు. రేప్ కేసుల్లో చిక్కుకున్న ఆశారాం బాపు సహా మొత్తం 14 మందిని బాబాలుగా పరిగణించ తగదని అఖారా పరిషత్ ప్రకటించింది. అయితే 2009 లోనే కర్ణాటకలో రేప్ కేసు నమోదైన నిత్యానంద ఆ జాబితాలో లేరు. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. కాస్త లోతుగా ఆరా తీస్తే ఆ లోగుట్టు కూడా బయటపడింది.
2013 లో మొత్తం 13 ఆఖారాలు కలిసి అలాహాబాద్ కుంభమేళా సందర్భంగా అఖిల భారత ఆఖారా పరిషత్ ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో 7 శైవ తెగకు, 3 వైష్ణవ తెగకు, 3 బౌద్ధ తెగకు చెందినవి. దేశవ్యాప్తంగా బాబాలు, స్వామీజీల పేరిట చెలామణి అవుతున్న వారి వ్యవహారాల మీద ఈ పరిషత్ ఓ కన్నేసి ఉంటుంది. అయితే ఈ నాలుగేళ్లలో ఆలా నకిలీ బాబాల విషయంలో అఖారా పరిషత్ చేసిందేమీ లేదు. ఇప్పుడు గురుమీత్ వ్యవహారంతో మేలుకొన్న అఖారా పరిషత్ మొత్తం 14 మంది నకిలీ బాబాల్ని గుర్తించి వారిపై వేటు వేసింది.
ఈ జాబితాలో నిత్యానంద పేరు కూడా చేర్చాలని జునా అఖారాకి చెందిన హరిగిరి వాదించారు. మెజారిటీ సభ్యులు ఇదే అభిప్రాయంతో ఉన్నప్పటికీ నిత్యానంద పేరు తుది జాబితాలో రాకుండా మహా నిర్వాణి ఆఖారాలు అడ్డుపడ్డారు. వీరిని ఇలా ప్రేరేపించింది ఇంకెవరో కాదట. అఖిల భారత ఆఖారా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరి అట. ఆయనకు ఆ అవసరం ఏంటా అని ఆరా తీస్తే చాలా విషయాలు బయటికి వస్తున్నాయి.
నరేంద్ర గిరి పేరుకి సాధువు గానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారట. అంత కన్నా దారుణం ఏమిటంటే నరేంద్ర గిరి ఆధ్వర్యంలో ఓ బార్ కూడా నడుస్తుందట. అందుకే ఆయనంటే పడని సాధువులు ఆయన్ని బార్ బాబా అని పిలుస్తుంటారు. ఈ నరేంద్ర గిరి డబ్బు ఆశని ఆసరాగా చేసుకుని నిత్యానంద నకిలీ బాబాల లిస్ట్ లో లేకుండా బయటపడ్డారట. నరేంద్ర గిరి ద్వారా మరికొందరు ఆఖారా సభ్యులకు కూడా ముడుపులు అందాయట. సర్వం త్యజించామని చెప్పుకునే సాధువులే ఇలా కక్కుర్తి పడుతుంటే ఎవరైనా ఇంకేమి చేయగలరు ?
మరిన్ని వార్తలు: