అఖిల్ అక్కినేని లేటెస్ట్ మేకోవర్ అదుర్స్ !

Akhil Akkineni Latest Makeover Adurs !
Akhil Akkineni Latest Makeover Adurs !

టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని చివరిసారిగా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఏజెంట్ లో కనిపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ హీరో తదుపరి ప్రాజెక్ట్ ని ఇంకా ప్రకటించలేదు. అయితే తన 6 వ మూవీ ను సాహో మరియు రాధే శ్యామ్ మూవీ లకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కే అవకాశం ఉన్నది . అయితే దీనిపై ఇంకా క్లారిటీ కూడా రాలేదు.

చాలా రోజుల తర్వాత అఖిల్ అక్కినేని బయట కనిపించాడు . హైదరాబాద్ విమానాశ్రయం వద్ద గుబురు గడ్డం, పొడవాటి జుట్టు తో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు . లేటెస్ట్ మేకోవర్ ఆడియెన్స్ ని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఇది కచ్చితంగా తన నెక్స్ట్ సినిమా కోసం అని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి అఖిల్ ఎలాంటి అప్డేట్ ని అందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.