‘మిస్టర్ మజ్ను’ టీజర్…కాస్త ఎక్కువే…!

Akhil Akkineni Mr.Majnu Official Teaser

‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా Mr.మజ్ను. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను జనవరి 25న రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, ‘ఏమైనదో.. ఏమైనదో.. పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’, టైటిల్ సాంగ్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మాంచి రొమాంటిక్ గా సాగిపోతున్న ఈ టీజర్ మీద మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.