ఆ ఆలోచన రావాలనే ఈ సినిమా తీశాం!

Varun Tej
Varun Tej

‘‘వెరైటీ సినిమాలు చేసినప్పుడల్లా.. కమర్షియల్‌ కథలు ఎంచుకోవచ్చు కదా అని అందరూ సలహాలు ఇస్తుంటారు. కానీ నాకు కొత్త తరహా కథలు చేయడమే ఇష్టం. అది హిట్టైనా, ఫ్లాప్‌ అయినా’’ అన్నారు వరుణ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. బివిఎ్‌సఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. శుక్రవారం విడుదల అవుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘‘మనం ఎప్పుడూ మన గురించే ఆలోచిస్తుంటాం.

కానీ ఇలాటి సినిమాలు చూసినప్పుడు మాత్రమ్ సమాజం కోసం ఆలోచించడం మొదలెడతాం. ఆ ఆలోచనతోనే ‘గాంఢీవధారి..’ సినిమా చేశా. మేం ఎంత కష్టపడినా సినిమానే మాట్లాడాలి. ఈ నెల 25న ఈ సినిమా విడుదలై . మంచి విజయం అందుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు ‘ఇలాంటి కథలు రాయడం సులభమే. కానీ హీరోలు అంగీకరించడమే కష్టం. ఎందుకంటే ఇది హీరో చుట్టూ తిరిగే కథ కాదు. కథలో హీరో ఓ భాగం మాత్రమే. సోషల్‌ ఇష్యూ నేపథ్యంలో ఈ సినిమా తీశాను.

కథలో భావోద్వేగాలు నచ్చుతాయ’’న్నారు ప్రవీణ్‌ సత్తారు. ‘‘వరుణ్‌తో మేం తీసిన ‘తొలి ప్రేమ’ సూపర్‌ హిట్టయ్యింది. ఈ సినిమాకీ అలాంటి ఫలితమే వస్తుంద’’న్నారు నిర్మాత. ‘‘వరుణ్‌ నా సోదరుడిలాంటి వాడు. మంచి కథలు ఎంచుకొంటాడు.ఈ సినిమా పెద్ద విజయాన్ని అందిచాల “ని అనిల్ రావిపూడి ఆకాంక్షించారు. తనకు