నిధికీ.. డెవిల్‌కీ మధ్య!

Ramesh Verma
Ramesh Verma

‘రైడ్‌’, ‘రాక్షసుడు’ చిత్రాలతో ఆకట్టుకొన్న దర్శకుడు రమేశ్‌ వర్మ. ఇప్పుడు మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. దీనికి ‘శివోహం’ అనే టైటిల్‌ ఖారారు చేశారు స్టూడియో గ్రీన్ పథకం పై జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం రమేశ్‌ వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా కాన్సెప్ట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.

మూసేసిన గుడి ద్వారం దాని ముందు త్రిశూలం చుట్టూ పూజ సామాగ్రి తో మాస్టర్ ఆసక్తిని రెకెక్కిస్తుంది.”అంతు చిక్కని నిధికి. డేవిల్ కీ మధ్య నడిచే యుద్ధం’’ అంటూ ఈ సినిమా కథ గురించి ఒక్క ముక్కలో చెప్పేశారు.

సంతోష్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఓ స్టార్ హీరో ఈ సినిమాలో నటిస్తున్నారానీ ప్రచారం జరుగుతుంది.. కథానాయకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.