Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా ఇప్పటి వరకు రెండు చిత్రాలు వచ్చాయి. మొదటి సినిమా ‘అఖిల్’ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. రెండవ సినిమా ‘హలో’ చిత్రం యావరేజ్ టాక్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం అఖిల్ మూడవ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. అదేనండి మెగా హీరో వరుణ్ తేజ్‌తో ‘తొలిప్రేమ’ చిత్రాన్ని చేసి సూపర్ హిట్ దక్కించుకున్నాడే ఆ దర్శకుడే వెంకీ అట్లూరి. ఒక యూత్‌పుల్ లవ్ స్టోరీతో అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రంను దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వెంకీ అట్లూరి ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడు. సినిమాను దసరాకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దసరాకు ఇప్పటికే ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ చిత్రం విడుదల కాబోతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఆ సినిమాకు పోటీగా అఖిల్ సినిమా వస్తుందా అనే అనుమానాలు ప్రస్తుతం సినీవర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. కనీసం వారం గ్యాప్‌తో రాకపోతే ఎన్టీఆర్ సినిమా ధాటికి అఖిల్ మూవీ ఖతం అయ్యే అవకాశం ఉంది. దసరాకు అఖిల్ రావడం శ్రేయస్కరం కాదు అంటూ అప్పుడే కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి అఖిల్ మూవీ గురించిన టాక్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. దసరాకు వస్తే సక్సెస్ దక్కించుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో అఖిల్ ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.