Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క్రిస్మస్ కానుకగా వచ్చిన ‘ఎంసీఏ’ మరియు ‘హలో’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ముఖ్యంగా ‘హలో’ చిత్రం జస్ట్ యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. అఖిల్ రెండవ సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్న అభిమానులు మరియు ప్రేక్షకులు చాలా నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు. ‘హలో’ టాక్‌కు తోడు ‘ఎంసీఏ’ చిత్రం కారణంగా కలెక్షన్స్‌ను రాబట్టడంలో విఫలం అయ్యింది. నాని నటించిన ‘ఎంసీఏ’ చిత్రం కూడా యావరేజ్ టాస్ తెచ్చుకుంది. అయినా కూడా క్రిస్మస్ హాలీడేస్‌ను నాని ఫుల్‌గా క్యాష్ చేసుకున్నాడు. మొదటి వారం రోజుల్లో ఏకంగా 26 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టింది. నాని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ఈ చిత్రం నిలిచింది.
‘ఎంసీఏ’ చిత్రం భారీ వసూళ్లను రాబట్టిన నేపథ్యంలో ‘హలో’ చిత్రం మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయింది. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘హలో’ చిత్రం కనీసం కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయినట్లుగా ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది. మొదటి వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్లను కూడా రాబట్టలేక పోయింది. ఈ వారంలో కొత్తగా మరో రెండు సినిమాలు వచ్చిన నేపథ్యంలో ‘హలో’ కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అవ్వడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. లాంగ్ రన్‌లో ‘హలో’ చిత్రం కనీసం 20 కోట్లను కూడా వసూళ్లు చేయడం కష్టమే అవ్వొచ్చు. అయితే ఎంసీఏ మాత్రం తన దూకుడును కొనసాగిస్తుంది. నాని మూవీ కలెక్షన్స్‌లో సగం అయినా హలో సాధిస్తుందనే నమ్మకం లేదని సినీ వర్గాల వారు అంటున్నారు.