ఏపీ సీఎం జగన్ పాలనపై టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై నేడు మీడియాతో మాట్లాడిన అఖిలప్రియ సీం జగన్ పాలనను చూసి పక్క రాష్ట్రాల వాళ్లు నవ్వుకుంటున్నారని అన్నారు. జగన్ పాలన హిట్లర్ పాలన మాదిరిగా ఉందని ఆమె అభివర్ణించారు
జగన్ అధికారం చేపట్టిన ఆరు నెలలలోనే ఆయన పాలన ఏంటో తేలిపోయిందని, ఆయనకు చేతకాకపోతే సీఎం పదవి నుంచి వైదొలగాలని సూచించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను మోసం చేయకండని, రైతు కన్నీరు పెడితే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందన్నారు. రాయలసీమ జనంతో వెళ్లి అమరావతి రైతులకు మద్దతు తెలుపుతామని ఆమె ప్రకటించారు. ప్రభుత్వం అమరావతి రైతుల తర్వాత రాయలసీమ రైతాంగంపై పడుతుందని, నారా లోకేష్‌ను అరెస్ట్ చేసినంత మాత్రాన రైతుల ఆందోళనలు తగ్గవని హెచ్చరించారు.