గట్టి పోటీ ఇస్తున్న అకిరా నందన్

గట్టి పోటీ ఇస్తున్న అకిరా నందన్

మెగా కుటుంబానికి సినిమా రంగం బాగా అచొచ్చిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఈ ఫ్యామిలీ నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన వారిలో ఒకరు ఇద్దరు తప్పా అందరూ క్లిక్ అయిపోయారు. అయితే ఒక్క సినిమా కూడా చేయకుండా పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా తన క్రేజ్ నిరూపించుకున్నాడు. ఏకంగా టాప్ హీరో బన్నీకే పోటీ ఇచ్చి ఔరా అనిపించాడు.

అయితే నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఈయన తాజాగా సుకుమార్‌తో చేస్తున్న పుష్ప సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే ఈ సందర్భంగా సోషల్  మీడియాలో బన్నీ ఫ్యాన్స్ రచ్చ చేశారు. దీంతో ట్విట్టర్‌లో బన్నీ హ్యాష్ ట్యాగ్ ఇండియాలో తొలి స్థానంలో ట్రెండ్ అయింది. ఇదిలా ఉంటే ఇదే రోజు అకిరా పుట్టిన రోజు కూడా ఉండడంతో ఇక మరో మెగా గ్రూప్ అకిరా ను కూడా బాగానే ట్రెండ్ చేసారు. అయితే ఇది ట్విట్టర్‌లో ఇండియాలో నాలుగో స్థానంలో ఉండడంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టకుండానే అల్లు అర్జున్‌కి పోటీ ఇస్తున్నాడని అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఏది ఏమైనా అకిరా కనుక ఇండస్ట్రీలోకి అడుగుపెడితే కనుక అతి తక్కువ కాలంలోనే రికార్డులు బద్దలుకొట్టడం గ్యారంటీ అన్నట్టు కనిపిస్తుంది.