అక్కినేని ఫ్యామిలీ మరోటి…!

Akkineni Nagarjuna Manmadhudu Movie Sequel

అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటిస్తూనే అన్నపూర్ణ స్టూడియోస్‌ స్థాపించాడు. స్టూడియో పేరు మీదే అంటే అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లోనే ఎన్నో చిత్రాలు నిర్మించాడు. ఈ బ్యానర్‌లో ఎన్నో చిత్రాలను నిర్మించిన నాగేశ్వరరావు తర్వాత నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌ లో సినిమాల నిర్మాణం మొదలు పెట్టాడు. నాగార్జునతో పాటు అక్కినేని హీరోలకు చెందిన పలు సినిమాలను అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో నిర్మించడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఉండగానే మనం ఎంటర్‌ప్రైజెస్‌ అనే బ్యానర్‌ను నాగార్జున స్థాపించిన విషయం తెల్సిందే. మనం ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్‌లో ఇప్పటి వరకు పూర్తి స్థాయి సినిమాలను తెరకెక్కించలేదు. ఇదే సమయంలో మరో బ్యానర్‌ ను కూడా నాగార్జున స్థాపించేందుకు సిద్దం అయినట్లుగా సమాచారం అందుతుంది.

nagarjuna-annapurna-studio

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున ఒక టీంను ఏర్పాటు చేసి వరుసగా చిన్న చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నాడు. సంవత్సరంలో మూడు నాలుగు చిన్న చిత్రాలను విడుదల చేసేలా ప్లాన్‌ చేశాడు. కొత్త బ్యానర్‌ను ప్రారంభించి మూడు నుండి అయిదు కోట్ల మద్యస్థ బడ్జెట్‌తో కొత్త వారితో సినిమాలను నిర్మించాలని నాగార్జున భావిస్తున్నాడు. పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలపై ఆసక్తి చూపుతున్న ఈ సమయంలో నాగార్జున కూడా చిన్న చిత్రాలతో వరుసగా ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నాడు. చిన్న చిత్రాల కారణంగా పెద్ద సినిమాలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు కొత్త బ్యానర్‌ ను నాగార్జున స్థాపించాలని బావిస్తున్నాడు. వచ్చే ఏడాది నాగార్జున నుండి రెండు చిన్న బడ్జెట్‌ చిత్రాలు వచ్చే అవకాశం ఉంది.

Nagarjuna at Devadas audio launch