రానా బాట‌లో అక్ష‌ర హాస‌న్…

akshara haasan follows to rana

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

క‌మ‌ల్ హాస‌న్ రెండో కుమార్తె అక్ష‌ర హాస‌న్, టాలీవుడ్ యువ హీరో రానా బాటలో ప‌య‌నిస్తోంది. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ ల ప్రాముఖ్యాన్ని గుర్తించిన అక్ష‌ర తాను కూడా వెబ్ సిరీస్ లో న‌టించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తోంది. కొన్ని క‌థ‌లు ఇప్ప‌టికే వింటున్న‌ప్ప‌టికీ… ఇంకా ఆమె ఏ సిరీస్ కూ ఓకె చెప్ప‌లేదు. రానా న‌టిస్తున్న సోష‌ల్ వెబ్ సిరీస్ లో ఓ పాత్ర కోసం వియూ మీడియా అక్ష‌ర హాస‌న్ ను సంప్ర‌దించింది. అయితే దాని గురంచి ఇంకా చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ని, ఆ సిరీస్ లో న‌టించ‌డంపై ఓ స్ప‌ష్ట‌త‌కు రాలేద‌ని తెలిపింది. సోష‌ల్ తో పాటు ఇత‌ర వెబ్ సిరీస్ ల‌కు సంబంధించిన క‌థ‌లు కూడా వింటున్నాని చెప్పింది.

ప్ర‌స్తుతం ఓ ట్రెండ్ గా మారిన వెబ్ సిరీస్ లు భ‌విష్య‌త్తులో అత్యంత ప్రాముఖ్య‌త సంత‌రించుకుంటాయ‌ని అభిప్రాయ‌ప‌డింది. సినిమాలు, వెబ్ సిరీస్ స‌మ‌న్వ‌యంతో సాగుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తంచేసింది. సోద‌రి శృతిహాస‌న్ అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ అక్ష‌ర హాస‌న్ మాత్రం ఇప్ప‌టిదాకా సినిమాల్లో పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. అయితే తొలిరోజుల్లో శృతిహాస‌న్ కూడా అక్ష‌ర హాస‌న్ లా వ‌రుస ప‌రాజ‌యాలు ఎదుర్కొంది. త‌ర్వాత గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో ఆమె కెరీర్ మారిపోయింది. అలాగే అక్ష‌ర హాస‌న్ కు కూడా ఓ హిట్ వ‌స్తే… తండ్రికి త‌గ్గ త‌న‌య‌గా గుర్తింపు తెచ్చుకునే అవ‌కాశ‌ముంది. ఆ క్ర‌మంలోనే వెబ్ సిరీస్ ల్లోనూ న‌టించేందుకు అక్ష‌ర ఆస‌క్తిచూపిస్తోంద‌ని భావిస్తున్నారు.