ఊహించిన దానికి భిన్నంగా జరిగిన చైతూ, సమంతల పెళ్లి

Chaitanya and Samantha will get married According to the Hindu tradition.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో కూడా సమంత, నాగచైతన్యల పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉందని, వీరిద్దరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని అంతా కోరుకున్నారు. ఎట్టకేలకు ఎదురు చూపులకు ఫుల్‌ స్టాప్‌ వేశారు. నిన్న రాత్రి గోవాలో సమంత, నాగచైతన్యల వివాహం వైభవంగా జరిగింది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటు సమంత కుటుంబ సభ్యులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ నుండి కొద్ది మంది మాత్రమే ఈ వివాహానికి హాజరు అయ్యారు. 100 మంది ప్రముఖులు మాత్రమే ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లుగా నాగార్జున చెప్పుకొచ్చాడు. కాని వంద మంది ప్రముఖులు కూడా కనిపించలేదు.

ఈ వివాహం పూర్తిగా తెలుగు హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగింది. పెళ్లి గోవాలో అనగానే ఖచ్చితంగా క్రిస్టియన్‌ మతాచారం ప్రకారం వివాహం ఉంటుందని అంతా భావించారు. కాని పెళ్లి జరిగిన తీరు చూస్తుంటే పూర్తిగా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. సమంత మెడలో నాగచైతన్య కట్టిన మంగళ సూత్రం కూడా తెలుగు హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఉంది. తమిళుల మంగళ సూత్రం విభిన్నంగా ఉంటుందనే విషయం తెల్సిందే. కాని అక్కినేని వారి ఆచారం ప్రకారం తెలుగు వారు ఏ విధమైన మంగళ సూత్రాన్ని ధరిస్తారో అదే మంగళ సూత్రంను సమంత మెడలో నాగచైతన్య వేయడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం.

నాగచైతన్య మరియు సమంతల వివాహం క్రిస్టియన్‌ సాంప్రదాయ పద్దతిలో జరుగుతుందని భావించినప్పటికి మొదట హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. నేడు గోవాలోని ఒక చర్చిలో సమంత, నాగచైతన్యలు రింగ్‌లు మార్చుకునే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ వివాహం సందర్బంగా సురేష్‌బాబు డాన్స్‌ వేయడంతో పాటు, వెంకటేష్‌ మరియు నాగార్జునలు సరదాగా కలిసి పెళ్లి వేడుకలో పాల్గొనడం చూడవచ్చు. అమల మరియు అఖిల్‌లు కూడా పెళ్లి హడావుడిలో కనిపించారు. అయితే చైతూ తల్లి మాత్రం ఈ పెళ్లి వేడుకలో కనిపించలేదు. ఆమె వచ్చిందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన నాగచైతన్య, సమంతలకు మా తరపున శుభాకాంక్షలు. వారిద్దరు జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వివాహ మహోత్సవం శుభాకాంక్షలు.