మామ‌య్య‌తో పెళ్లికూతురు స‌మంత‌

nagarjuna photo with Samantha Ruth Prabhu's from her wedding

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

త‌న కోడ‌లు స‌మంత మ‌రికొన్ని గంట‌ల్లో వ‌చ్చేస్తోందంటున్నాడు అక్కినేని నాగార్జున. రాత్రి 11.52 గంట‌ల‌కు నాగ‌చైత‌న్య‌, స‌మంత వివాహం జ‌ర‌గ‌నున్న త‌రుణంలో స‌మంత‌తో క‌లిసి దిగిన ఫొటోను నాగార్జున పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో స‌మంత న‌వ్వుతూ నాగార్జునను ఆప్యాయంగా హ‌త్తుకుంది. పెళ్లితో స‌మంత ఎంత సంతోషంగా ఉందో ఈ ఫొటో చూస్తే అర్ద‌మ‌వుతోంది. నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లివేడుక‌ల‌తో గోవాలో అక్కినేని, ద‌గ్గుబాటి కుటుంబాలు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. ఇవాళ హిందూ సంప్ర‌దాయ ప్ర‌కారం, రేపు క్రిస్టియ‌న్ ప‌ద్ధ‌తిలో ప్రేమికులు ఒక్క‌టి కానున్నారు. ఉద‌యం నాగ‌చైత‌న్య‌ను బంధువుల స‌మ‌క్షంలో పెళ్లికొడుకును చేశారు. ఆ ఫోటోను నాగార్జున‌, వెంక‌టేశ్ ట్విట్ట‌ర్ లో అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. అటు నాగ‌చైత‌న్య‌, స‌మంత‌కు ట్విట్ట‌ర్ లో అభిమానులు పెళ్లి శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.