టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఏ సినిమా చేసినా కనీసం రెండు మూడు సంవత్సరాలు తీసుకుంటాడు. ఇక నేను కూడా ఏం తక్కువ కాదని తమిళ దర్శకుడు శంకర్ కూడా తన ప్రతి సినిమాకు మూడు సంవత్సరాలకు తగ్గకుండా తీసుకుంటున్నాడు. 2.ఓ చిత్రాన్ని ఏకంగా నాలుగు సంవత్సరాలు తీసిన ఈయన తదుపరి చిత్రం ‘ఇండియన్ 2’ అనే విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ 2.ఓ చిత్రాన్ని తెరక్కించి ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న శంకర్ ఆ వెంటనే ఇండియన్ 2 చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేసిన దర్శకుడు త్వరలోనే సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.
‘2.ఓ’ చిత్రానికి మరియు తన గత చిత్రాలకు తీసుకున్నంత సమయంను ఈ చిత్రానికి తీసుకోను అంటూ శంకర్ చెబుతున్నాడు. 2019లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తాను అంటూ ప్రకటిచాడు. కమల్ హాసన్ వచ్చే ఏడాదిలో ఎన్నికల ఉన్న కారణంగా అప్పటి వరకు సినిమా పూర్తి చేయాలని శంకర్‌ను కోరుతున్నాడట. కాని అప్పటి వరకు పూర్తి అయ్యేది అనుమానమే కాని, వచ్చే ఏడాది చివరి వరకు సినిమాను పూర్తి చేయలని శంకర్ భావిస్తున్నాడట. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడి కానున్నాయి. ఈచిత్రంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్‌లు నటించే అవకాశం ఉందట. ఇక దుల్కర్ సల్మాన్ మరియు శింబులు ఈ చిత్రంలో నటించబోతున్నారు. కాజల్ హీరోయిన్గా ఎంపిక అయ్యే అవకాశం ఉంది. వెన్నెల కిషోర్‌ను ఈ చిత్రం కోసం సంప్రదించారట.