సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయి, బాక్సఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్న సినిమా అలా వైకుంఠపురంలో, బాహుబలి తర్వాత ఆ స్థాయి రికార్డులని కొల్లగొట్టిన చిత్రంగా ప్రశంసలు దక్కించుకుంటుంది. అయితే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తాజాగా మరొకసారి వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్ర కథ నాదే అంటూ కృష్ణ అనే దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే త్రివిక్రమ్ కి నోటీసులు పంపుతా అంటూ వ్యాఖ్యానించారు. త్రివిక్రం ని 2005 లో కలిసినపుడు కథ వివరించానని, 2013 లో ఈ కథని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించుకున్నానని, కథని వాడుకొని క్రెడిట్స్ లో తన పేరు ప్రస్తావించలేదని అన్నారు.
అయితే కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు గుర్తు మరొకసారి గుర్తు చేసారు. త్రివిక్రమ్ కథని కాపీ కొట్టారని కత్తి మహేష్ తెలిపారు. అయితే గొప్పోడి కొడుక్కి గొప్ప గుణాలే వస్తాయి, అదే దుర్మార్గుడి కొడుక్కి దుర్మార్గపు లక్షణాలు రాకపోయినా గొప్పోడైతే కాడు, కాలేడు. అలా వైకుంఠపురంలో ఒక ప్రమాదకరమైన సినిమా,అన్యాపదేశంగా పుట్టుకతో సంక్రమించే కులాన్ని, తద్వారా సమాజంలో వచ్చే ప్రివిలైజెస్ ని, వివక్షను సాధారణీకరించే భావజాలాన్ని వ్యాప్తి చేసే కథ ఇది అని కత్తి పేర్కొన్నారు. అయితే కృష్ణ చేసిన వ్యాఖ్యలకు త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో అరవింద సమేత వీర రాఘవ రెడ్డి చిత్రానికి కూడా కథ వివాదం త్రివిక్రమ్ కి ఎదురైంది.