కరోనా ఎఫెక్ట్ తో జనజీవనం అతలాకుతలం అవుతుంటే దొంగతనాలు కూడా భారీగా జరుగుతన్నాయి. లాక్‌డౌన్‌తో నేరాల సంఖ్య తగ్గుతుంటే.. మరోవైపు మద్యం దొంతనాలు భారీగా నమోదౌతున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు కొందరైతే మద్యం ప్రియులు ఏకంగా షాపులే పగలకొట్టి మరీ దోచుకుపోతున్నారు. మద్యపానానికి బానిసై చుక్కపడనిదే బతకలేక చోరీలకు తెగబడుడుతున్నారు. అర్ధరాత్రి వేళ రెండు మద్యం దుకాణాల్లోకి ప్రవేశించి బీర్లు, మద్యం సీసాలను దొంగిలించిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
కరోనా ప్రభావంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. అందులో భాగంగా మద్యం షాపులను కూడా మూసేయడంతో మద్యానికి ఎక్కడ లేని గిరాకీ పెరిగింది. చుక్క గొంతులో పడక మందుబాబులు మద్యం కోసం తహతహలాడుతున్నారు. ఏకంగా మందు దొంగతనానికి పాల్పడుతున్నారు. రాయ్‌పూర్‌లోని అమ్లిది, అవంతి విహార్ ప్రాంతాల్లో ఉన్న రెండు మద్యం దుకాణాలను దోచుకెళ్లారు. రెండు షాపులను పగలగొట్టి మరీ లోపలికి ప్రవేశించి మద్యం సీసాలను చోరీ చేశారు. గోడకి కన్నం పెట్టి అమ్లిది ప్రాంతంలో మద్యం దుకాణంలోకి ప్రవేశించిన దుండగలు 40 బీర్ సీసాలను దోచుకెళ్లారు. అవంతి విహార్ వైన్ షాప్ గ్రిల్స్ విరగ్గొట్టి ఏకంగా 20 మద్యం కేసులను ఎత్తుకెళ్లారు. ఇక్కడో ట్విస్ట్ ఏమిటంటే.. అయితే దుకాణాల్లో కౌంటర్లో ఉన్న నగదును కనీసం ముట్టుకోకపోవడం విశేషం.