కోరనా కారణంగా లాక్ డౌన్ లో దేశం తలదాచుకుంటుంది. కరోనా వైరస్ భయంతో ప్రజలు భయటకు వచ్చేందుకు తీవ్రంగా భయపడుతున్నారు. ఈ సమయంలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తీవ్ర కష్టాల పాలౌతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మద్యం దొరక్క ఫిట్స్ వచ్చి చనిపోయాడు. అంతేకాకుండా మరో వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది.
అదేమంటే.. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ కు చెందన రాజు చింతల్ బస్తీలో నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిస అయ్యాడు. కరోనా దెబ్బకు సర్వం బంద్ లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో మద్యం ఎక్కడా దొరక్క పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సాధారణ దుకాణాలతో పాటు వైన్స్ షాపులు కూడా కొద్ది రోజులుగా మూసి ఉంచారు. దీంతో అతనికి మందు ఎక్కడా దొరకలేదు. దీంతో మద్యానికి బానిసైన అతను చుక్క పడక ప్రాణం విలవిలలాడిపోయింది.
కాగా రోజు కూలీకి వెళ్తూ జీవనం సాగిస్తున్న అతను పని నుంచి ఇంటికి వచ్చే ముందు దారిలోనే మద్యం దుకాణానికి వెళ్లి మందు తాగి ఇంటికి వెళ్లేవాడు. ఇలా చాలాకాలంగా జీవనం సాగిస్తున్నాడు. లాక్ డౌన్ తో చాలా రోజుల నుండి మద్యం దొరక్క పోవడంతో అది భరించలేని అతను ఇంట్లో ఉన్న కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే వెంటనే మేలుకున్న ఆయన కుటుంబ సభ్యులు అతడిని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.