ఏపీ విద్యార్థులకు అలర్ట్‌.. టెన్త్ పరీక్ష ఫీజు షెడ్యూల్

Alert for AP students.. Tenth exam fee schedule
Alert for AP students.. Tenth exam fee schedule

ఏపీ విద్యార్థులకు అలర్ట్‌.. టెన్త్ పరీక్ష ఫీజు షెడ్యూల్ వచ్చేసింది. పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల చేసినట్లు ఏపీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ‘విద్యార్థులు నవంబర్ 10లోగా ఫీజు చెల్లించాలి. 11వ తేదీ నుంచి 16 వరకు రూ. 50 పెనాల్టీతో ఫీజు చెల్లించవచ్చు. 17 నుంచి 22వ తేదీ వరకు రూ. 200, 23 నుంచి 30వ తేదీ వరకు రూ. 500 లేట్ ఫైన్ తో ఫీజు చెల్లించాలన్నారు ఏపీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి.

ఇక గడువు పొడిగింపు ఉండదు. పాఠశాలల హెచ్ఎంలు దీని పై దృష్టి సారించాలి’ అని డైరెక్టర్ పేర్కొన్నారు. ఇక టెన్త్ పరీక్ష ఫీజు షెడ్యూల్ ప్రకారమే… అందరూ రూల్స్‌ పాటించాలని ఏపీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి కోరారు. టెన్త్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విషయంలో.. ఆంధ్ర ప్రదేష్ విద్యార్థులు లైట్ తీసుకోవద్దని కోరారు.