World Cup 2023 : ప్రపంచ కప్‌ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్‌ !

World Cup 2023: Pakistan has left the World Cup!
World Cup 2023: Pakistan has left the World Cup!

ప్రపంచ కప్‌ నుంచి పాకిస్థాన్‌ ఔట్‌ అయినట్లే కనిపిస్తోంది. వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్తాన్ కు మరో ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ పోరులో ఓడి టోర్నీలో వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రపంచకప్ లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది. 271 పరుగుల లక్ష్యాన్ని 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతి కష్టం మీద ఛేదించింది.

ఓ దశలో దక్షిణాఫ్రికా ఐడెన్ మార్కరమ్ (91) అదరగొట్టడంతో దక్షిణాఫ్రికా సులువుగా గెలిచేలా కనిపించింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి టెన్షన్ లో పడింది. చివర్లో కేశవ్ మహారాజ్ (7నాటౌట్) విలువైన పరుగులు చేసి సఫారీ జట్టును గెలిపించాడు. దీంతో ఒక వికెట్ తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. పాకిస్తాన్ తొలిసారిగా ప్రపంచకప్ చరిత్రలో వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది.