భారత్‌లోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరానికి (2024-25) బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాది మే 26వ తేదీన ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు వహిస్తున్న ఐఐటీ మద్రాస్.. జేఈఈ అడ్వాన్స్డ్-2024 పరీక్ష షెడ్యూల్, సిలబస్ వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అర్హులు. గత పరీక్షకు ఉన్న సిలబసే ఈసారి కూడా ఉంటుందని వెబ్సైట్లో ఉంచిన సిలబస్‌ను బట్టి తెలుస్తోంది.
జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ 12వ తేదీ నాటికి ముగుయనుండగా, వాటి ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆన్లైన్ రిజిస్ట్రేషన్ షురూ అవుతుంది. అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 21వ తేదీ నుంచి .. మెయిన్ ర్యాంకులు ఏప్రిల్ 20వ తేదీన వెల్లడి కానున్నట్లు సమాచారం.
జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 21 నుంచి 30 వరకు.
హాల్‌టికెట్లు: మే 17-26 వరకు అందుబాటులో ఉంటాయి.
అడ్వాన్స్డ్ పరీక్ష: పేపర్-1 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు.
పరీక్ష ప్రాథమిక కీ విడుదల: జూన్ 2న. దానిపై అభ్యంతరాలు, అభిప్రాయాలను 3వ తేదీ వరకు పంపొచ్చు.
ఫలితాల విడుదల: జూన్ 9వ తేదీ ఉదయం 10 గంటలకు