ఏపీ ప్రజలకు అలర్ట్‌.. ఇకపై ACలు మేడిన్ ఆంధ్రా !

Alert to the people of AP.. No more ACs Madin Andhra!
Alert to the people of AP.. No more ACs Madin Andhra!

ఏపీ ప్రజలకు అలర్ట్‌.. జపాన్ కు చెందిన డైకిన్ సంస్థ ఏపీలో ఏసీలను తయారు చేయనుంది. ఈనెల 23న నెల్లూరు జిల్లా శ్రీ సిటీలో 75 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1000కోట్లతో ఏర్పాటు చేసిన ప్లాంట్ లో ఉత్పత్తిని ప్రారంభించనుంది. తొలి దశలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా ఏటా 10 లక్షల ఏసీలను తయారు చేయవచ్చు. గతేడాది ఏప్రిల్ లో నిర్మాణ పనులు ప్రారంభించగా… 18 నెలల్లోనే యూనిట్ ను సిద్ధం చేసింది. ఈ యూనిట్ ద్వారా 3 వేల మందికి ఉపాధి దక్కింది.

ఇక అటు త్వరలోనే కర్నూలులో లా యూనివర్సీటీ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జగన్నాథ్ గట్టుపై రూ. 600 కోట్లతో 250 ఎకరాలలో నిర్మించబోయే లా యూనివర్సిటీకి డిసెంబర్ లో భూమి పూజ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నేషనల్ యూనివర్సిటీ (ఎన్ ఎల్ యూ) ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు న్యాయ విద్యను అభ్యసించేందుకు వీలుందంటున్నారు.