“లియో” ట్రైలర్ పైనే అందరి కళ్ళు..!

“లియో” ట్రైలర్ పైనే అందరి కళ్ళు..!
Movie News

ప్రస్తుతం కోలీవుడ్ సహా సౌత్ ఇండియా చిత్రాల దగ్గర ఉన్న మూవీ లవర్స్ అంతా కూడా మంచి ఎగ్జైటెడ్ గా భారీ అవైటెడ్ సినిమా “లియో” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ దసరా కానుకగా ప్లాన్ చేస్తున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయితే దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించగా ఈరోజు ఈ మూవీ నుంచి ట్రైలర్ కట్ ని రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ ట్రైలర్ పైనే అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

“లియో” ట్రైలర్ పైనే అందరి కళ్ళు..!
Leo Movie

మెయిన్ గా అయితే ఈ చిత్రం విజయ్ నుంచి అనే దానికంటే లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కావడంతో ఎలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ లింక్ లు చూపిస్తాడు అలానే ఎవరైనా ఇతర స్టార్ హీరోల హింట్ లు కానీ ఉంటాయా అనే అంశాలు ఆసక్తిగా మారాయి. దీనితో ఈ భారీ చిత్రం ట్రైలర్ కోసం అందరి కళ్ళు ఎదురు చూస్తున్నాయి. మరి లోకేష్ అయితే ఈ ఎగ్జైట్మెంట్ కి తగ్గ సాలిడ్ ట్రైలర్ కట్ ని డెలివర్ చేస్తాడో లేదో చూడాలి.