Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు రెండేళ్ల ముందే పొత్తు రాజకీయం తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలకు పొత్తులు అవసరమే. అందుకే ఎవరికి వారు వ్యూహరచన చేసుకుంటున్నారు. ఏపీలో బీజేపీ, టీడీపీ ఎంతవరకూ కలిసుంటాయనేద అనుమానాలు ఉన్నాయి. అటు వైసీపీ కూడా బీజేపీతో పొత్తుకు తీవ్రంగా ట్రై చేస్తోంది. దీనికి పీకే సలహానే కారణమంటున్నారు.
ఏపీ కాంగ్రెస్ మాత్రం పొత్తుల ఆలోచన చేయడం లేదు. వామపక్షాలు కూడా ప్రస్తుతానికి సైలంట్ గా ఉన్నాయి. పవన్ తో కలిసి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ ఇప్పటికైతే పొత్తుల గురించి ఆలోచించడం లేదు. ఇక్కడ బీజేపీ పరిస్థితి కూడా అయోమయంగానే ఉంది. కానీ టీడీపీ, కాంగ్రెస్ కలిసే ఎన్నికలకు వెళ్లే అవకాశాలు మాత్రం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎంఐఎం షరామామూలుగా స్నేహపూర్వక పోటీకి దిగుతుంది. ఇందులో అనుమానం లేదు. మరి తెలంగాణలో వామపక్షాలు ఏం చేస్తాయన్నది ఆసక్తికరమే. మొత్తం మీద అన్ని పార్టీలు పొత్తుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఎవరితో జత కడతారో కీలకంగా మారింది. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాన్ని బట్టే.. వైసీపీ ఫ్యూచర్ ప్లాన్ ఉండబోతోంది.
మరిన్ని వార్తలు:
హరిబాబుకు అదృష్ట యోగం పట్టినట్లే
కాంగ్రెస్ వి ఉత్తర కుమార ప్రగల్భాలేనా.