సదావర్తి సత్రం భూముల కేసులో హై కోర్టు కి ఇచ్చిన మాట ప్రకారం తొలివిడతగా 10 కోట్లు చెల్లించేశారు మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అలియాస్ ఆర్కే. రెండో విడతలో మిగిలిన 17 కోట్ల పైచిలుకు చెల్లిచాల్సి వుంది. అంత మొత్తం చెల్లించాల్సి వున్నా ఆర్కే మోహంలో ఏ మాత్రం టెన్షన్ లేదు. ఆ విడత కూడా చెల్లించి సదావర్తి సత్రానికి చెందిన 84 ఎకరాలు సొంతం చేసుకుంటామన్న నమ్మకం ఆర్కే మోహంలో కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇంత మొత్తంలో నగదు నిల్వలు పూల్ చేయాలంటే మామూలుగా అయ్యే పని కాదు. ఇక ఎమ్మెల్యే ఆర్కే తో అయ్యే పని అంతకంటే కాదని సాక్షాత్తు వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. మరి ఇంత మొత్తాన్ని ఆర్కే ఎలా తెచ్చాడన్నదానిపై, ఎవరి నుంచి తెచ్చాడన్నదానిపై కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.
వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన తనయుడు రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి వ్యాపార సంస్థల నుంచి ఆర్కే కి డబ్బు అందినట్టు వైసీపీ నాయకులు కొందరు బయటపెట్టారట.ఆ నాయకులు చెబుతున్న దాని ప్రకారం ముందుగా ఆర్కే పేరిట సదావర్తి భూములు రిజిస్ట్రేషన్ అయ్యాక వాటిని పెద్దిరెడ్డి వ్యాపార సంస్థలకి బదిలీ చేస్తారట. ఈ విషయం ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. ఏమైనా సదావర్తి భూముల వ్యవహారంలో జోక్యం చేసుకుని పెద్దిరెడ్డి కుటుంబం బాగా ధైర్యం చేసింది. అయితే ఈ వ్యవహారం అనుకున్నంత సాఫీగా జరిగే అవకాశం లేదట. ఎందుకంటే …
ఒకప్పుడు ఈ భూముల విలువ 1000 కోట్ల పైమాటే అని సాక్షి కధనాలు ఇచ్చింది. ఆర్కే కూడా ప్రజాప్రయోజనాల వ్యాజ్యం తో అదనంగా 5 కోట్లు మాత్రమే చెల్లించి సదావర్తి భూములు సొంతం చేసుకోబోతున్నారు. అంటే సాక్షి చెప్పింది నిజమే అయితే ప్రభుత్వానికి దక్కింది అదనంగా ఐదు కోట్లు అయితే ఆర్కే కి 900 కోట్లకి పైగా లాభం. దీని కోసమేనా వైసీపీ పోరాడింది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సదవర్తి సత్రం భూములతో సంబంధం వున్న కొందరు దీనిపై ఇంకోసారి కోర్టు మెట్లు ఎక్కే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఆర్కే, ఆయనకి ఫైనాన్స్ చేసిన వారికి కూడా ఇబ్బందులు తప్పవేమో!