Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అవినీతి, బంధుప్రీతి, పక్షపాతం… ఇలా రాజకీయానికి వున్న నెగటివ్ పాయింట్స్ ఎన్ని అయినా చెప్పుకుంటాం. అయితే అదే రాజకీయం, అధికారం కోసం అంతకు మించిన వెన్నుపోట్లు జరుగుతాయి. అయినవాళ్లు తమ అధికార దాహం కోసం నీడ ఇచ్చిన చెట్టుని, ఆ చెట్టు కొమ్మని కూడా ఎలా నరుకుతారో ఇప్పటికే చాలా మందికి అనుభవం అయ్యింది. ఇలాంటిదే ఓ కథ రీసెంట్ గా బయటికి వచ్చింది. ఓ వైసీపీ నేతని తాను పెంచిన వాళ్ళే ఏమి చేశారో చూద్దాం.
ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. ఈ పేరు వ్యాపార , రాజకీయ వర్గాలకు చిరపరిచితమే. రామ్ కీ సంస్థల అధినేత అయిన ఈయన తన సొంత శక్తిసామర్ధ్యాలతో వ్యాపార సంస్థల్ని అభివృద్ధి చేశారు. ఆ క్రమంలో ముందుగా చంద్రబాబు, ఆపై రాజశేఖర్ రెడ్డి కి దగ్గరగా మెసిలారు. ఆయన తాను ఎదగడమే కాకుండా సొంత తమ్ముడు రామకృష్ణ రెడ్డి( ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ), బావమరిది మోదుగుల వేణుగోపాల రెడ్డి ( గుంటూరు ఎమ్మెల్యే ) ని చేరదీశారు. ఆయన నీడలోనే ఆ ఇద్దరూ ఆర్ధికంగా, సామాజికంగా ఎదిగారు. రాజకీయ పరిచయాలు పెరిగాయి. ఆ ఇద్దరికీ రాజకీయ ఆకాంక్ష పెరిగింది. 2009 లో అయోధ్య బావమరిది మోదుగుల వేణుగోపాలరెడ్డి చివరి నిమిషం దాకా కాంగ్రెస్ బాపట్ల అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ అది వర్క్ అవుట్ కాకపోవడంతో వై.ఎస్ తో దగ్గరగా వున్న బావ అయోధ్య రామిరెడ్డి ని కాదని నరసరావుపేట టీడీపీ ఎంపీ టికెట్ తెచ్చుకుని గెలిచారు. 2014 లో వైసీపీ నుంచి బావ అయోధ్య రామిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా నరసరావుపేట నుంచి పోటీ చేస్తారని తెలిసినా టీడీపీ తరపున పోటీకి మోదుగుల సై అన్నారు. అయితే టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పోటీ తప్పింది.
ఇక అయోధ్య రామిరెడ్డి సంస్థల్లోనే పనిచేసిన ఆయన తమ్ముడు ఆళ్ల రామకృష్ణారెడ్డిడి ఇంకో స్టోరీ. జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టాలి అనుకున్నప్పుడు ఆయనతో వ్యాపార సంబంధాలు నెరపిన అయోధ్య రామిరెడ్డి రామ్ కీ సంస్థల మీద కూడా కేసులు పడొచ్చని సందేహించారు. అందుకే జగన్ పార్టీకి తాత్కాలికంగా దూరం గా ఉందామని ఆయన చెప్పినా వినకుండా రామకృష్ణారెడ్డి వైసీపీ లో చేరారు. ఆ తర్వాత రామ్ కీ మీద కేసుల విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆ సంస్థ షేర్ వేల్యూ పడిపోయి అయోధ్య రామిరెడ్డికి వందల కోట్లలో నష్టం వచ్చింది. అప్పటినుంచి ఆ అన్న ఎదురుగా వెళ్లి నిలబడే ధైర్యం చేయలేదు ఆ తమ్ముడు.
ఈ ఇద్దరి వ్యవహారశైలి చూసాక రాజకీయ దాహం ఎలా ఉంటుందో అర్ధం అవుతుంది. ఇద్దరూ తమ రాజకీయ అభిలాష నెరవేర్చుకోడానికి పైకి తెచ్చిన అయోధ్య రామిరెడ్డిని, ఆయన మాటని, ఆయనకి జరిగే నష్టాన్ని ఏ మాత్రం లెక్కజేయకుండా ఎలా వ్యవహరించారో అర్ధం అవుతుంది. ఆ ఇద్దరి పేరులో ప్రత్యక్షం గానో, పరోక్షంగానో కృష్ణుడు వున్నాడు. దెబ్బ తిన్నది మాత్రం అయోధ్య రాముడు. ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు రాజకీయం లోతు ఎంతో అర్ధం అవుతుంది.