Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Allari Naresh To Be Part Of Mahesh Babu Next Movie
‘ఎవడు’, ‘ఊపిరి’ చిత్రాల తర్వాత వంశీ పైడిపల్లి త్వరలో మహేష్‌బాబు హీరోగా ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. వంశీ తన గత రెండు చిత్రాలను ఇద్దరు హీరోలతో చేయడం జరిగింది. ‘ఎవడు’ సినిమాలో రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లు నటించారు. అల్లు అర్జున్ గెస్ట్ అప్పియరెన్స్‌లో కొద్ది సమయం కనిపించాడు. ఇక ‘ఊపిరి’ సినిమాలో నాగార్జున మరియు కార్తీలు ఇద్దరు కూడా ఫుల్‌లెంగ్త్ పాత్రల్లో నటించారు. ఇప్పుడు కాకతాళీయమో లేక నిజంగానే అనుకుని చేస్తున్నాడో కాని మహేష్‌తో మరో హీరోను వంశీ పైడిపల్లి ఎంపిక చేయడం జరిగింది.
ప్రస్తుతం ‘స్పైడర్’ను ముగించే పనిలో ఉన్న మహేష్‌బాబు ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో చిత్రాన్ని చేయనున్నాడు. నవంబర్ లేదా డిసెంబర్లో కొరటాల, మహేష్‌ల సినిమా పూర్తి అయ్యి సంక్రాంతికి విడుదల అవ్వనుంది. ఆ వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు నటించనున్నాడు. అంటే వచ్చే సంవత్సరం ఆరంభంలో ఈ సినిమా ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అల్లరి నరేష్‌ను వంశీ పైడిపల్లి సంప్రదించడం జరిగిందని, అందుకు అల్లరోడు కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. మహేష్‌బాబు కూడా ఇప్పటికే అల్లరి నరేష్‌తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో వచ్చే సంవత్సరంలో మహేష్ అల్లరి కాంబో చూడబోతున్నాం.
మరిన్ని వార్తాలు:
ఎన్టీఆర్ కాబట్టి చేశా.. మళ్లీ చేయను
కమల్ అబద్దం చెప్తున్నాడు