Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాహుబలి’ చిత్రం విజయంతో పౌరాణిక చిత్రాలకు ఇండియాలో మంచి ఆధరణ ఉందని తేలిపోయింది. అందుకే రామాయణం నేపథ్యంలో ఒక భారీ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయి.
రామాయణ మహాగాధను ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా..అది సంపూర్ణం కాదు. ఇంకా చెప్పాల్సిందో ఏదో మిగిలే ఉంటుంది. ఇక అంతటి గొప్ప పురాణాన్ని తెరకెక్కించడం చాలా కష్టమైన పని. రామయాణంపై ఎన్ని భాషల్లో ఎన్నిరకాల సినిమాలు వచ్చినా…అవేవీ మొత్తం రామాయణాన్ని కళ్లకు కట్టలేదు. సీతా,రాముల పరిణయం, వనవాసం, సీత బహిష్కరణ, లవకుశల పుట్టుకవంటి కొన్ని ఘట్టాలు మాత్రమే వెండితెరపై సినిమాలుగా రూపొందాయి. మూడుగంటల సినిమాలోనే కాదు…రోజులు,వారాలు, నెలలు, సంవత్సరాలు పాటు సాగే సీరియళ్లలోనూ రామాయణం మొత్తం కథను వివరించడం కష్టమే. అయినప్పటికీ రామాయణం మీద సినిమాలూ, సీరియళ్లు అన్నిభాషల్లో వస్తూనే ఉంటాయి.
రాములవారి చరిత్ర ఎంత విన్నా, చదివినా, చూసినా తనివి తీరదు. అందుకే రామాయణం కథ మన దేశంలో హిట్ ఫార్ములా.అందుకే త్రీడీ యుగంలోనూ రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రామాయణానికి సాంకేతికత జోడించి కొంగొత్తగా మన ముందుకు తెచ్చేందుకు రంగం సిద్దమయింది. చాలా కాలంగా రామాయణంపై ఈ వార్త వినపడుతున్నప్పటికీ..త్వర లో కార్యరూపు దాల్చుతోంది. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అద్భుతంగా తెరకెక్కించనున్నారు. ఈ ప్రక్రియలో ఓ తెలుగు నిర్మాత కూడా భాగస్వామి కావడం విశేషం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతేనా, నమిత్ మల్హోత్రాతో కలిసి రామాయణాన్ని నిర్మించనున్నారు.
మూడు భాషల్లో త్రీడీ టెక్నాలజీతో రూపొందనున్న ఈ సినిమా నిర్మాణం కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన చలనచిత్ర విభాగం ఫిల్మ్ బంధుతో నిర్మాతలు తాజాగా ఓ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు నిర్మాతల్లో ఒకరైన మధు మంతేనా ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్మాణంలో యూపీ ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అవ్వడంతో పాటు, సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాలను యూపీలో నిర్వహించేందుకు ఉచిత అనుమతులు జారీ చేయనుంది.ఈ సంవత్సరం చివర్లో సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదయ్యే అవకాశాలున్నాయని త్వరలోనే పూర్తి వివరాలను వెళ్లడి చేస్తామని నిర్మాత మధు మంతెన పేర్కొన్నారు.