అల్లు అర్జున్‌ వద్దకు ‘96’…!

Allu Arjun Finally Rejects 96 Movie Remake

తమిళంలో విజయ్‌ సేతుపతి మరియు త్రిష కలిసి నటించిన ‘96’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై ముందు నుండి భారీ ఎత్తున అంచనాలున్న కారణంగా సినిమాను తెలుగులో డబ్‌ చేయాలని అంతా భావించారు. కాని దిల్‌రాజు మాత్రం ఈ చిత్రం డబ్బింగ్‌ చేయడం కంటే రీమేక్‌ చేయడం ఉత్తమం అని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే ఈ చిత్రంరీమేక్‌ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేయడం జరిగింది.

allu-arjun

మొదట ఈ రీమేక్‌ను నానితో చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. నాని మరియు సమంతల కాంబోలో ఈ చిత్రం రీమేక్‌ అవ్వడం ఖాయం అంటూ అంతా అనుకుంటున్న సమయంలో ఈ చిత్రం అల్లు అర్జున్‌ వద్దకు వెళ్లడం చర్చనీయాంశం అవుతుంది. అల్లు అర్జున్‌తో ఈ సినిమా రీమేక్‌ చేస్తే బాగుంటుందని దిల్‌రాజు భావించాడట. అందుకే తాజాగా అల్లు అర్జున్‌కు ప్రత్యేక షో వేయించి మరీ ఈసినిమాను చూపించాడు. అయితే అల్లు అర్జున్‌ ఏమన్నాడు అనే విషయమై క్లారిటీ రాలేదు. గతంలో పలు సినిమాలు తెలుగులో రీమేక్‌ అయ్యాయి. కాని ఎక్కువ శాతం సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. అందుకే అల్లు అర్జున్‌ ఈచిత్రంను చేయకుంటేనే బెటర్‌ అంటూ మెగా ఫ్యాన్స్‌ అంటున్నారు.

dill-raj-movies