అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చిన విషయం తెల్సిందే. ఏమాత్రం ఆకట్టుకోకుండా, ఫ్లాప్ అయిన ‘నా పేరు సూర్య’ చిత్రం తర్వాత బన్నీ సినిమాకు కమిట్ అయ్యేందుకు భయపడుతున్నాడు. మరో ఫ్లాప్‌ను భరించడం తన వల్ల కాదు అన్నట్లుగా బన్నీ ఆలోచన ఉంది. అందుకే నా పేరు సూర్య చిత్రం తర్వాత బన్నీ చేయాల్సిన విక్రమ్ కుమార్ మూవీని క్యాన్సిల్ చేసుకోవడం జరిగిందని సమాచాంర అందుతుంది. రిస్క్ చేయవద్దనే ఉద్దేశ్యంతోనే ఇలా విక్రమ్ కుమార్ మూవీని క్యాన్సిల్ చేశాడని, ఒక మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశ్యంతో బన్నీ ఎదురు చూస్తున్నాడు.
ఆలస్యం అయినా పర్వాలేదు కాని త్రివిక్రమ్‌తోనే సినిమా చేయాలని బన్నీ భావిస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత బన్నీతో ఈయన సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే బన్నీ, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. అందుకే ఈ చిత్రం తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే ఆలస్యం అయినా పర్వాలేదు త్రివిక్రమ్ మూవీతోనే వస్తాను అంటూ బన్నీ అంటున్నాడు. వచ్చే ఏడాది చివర్లో బన్నీ సినిమా ఉండే అవకాశం ఉంది. త్రివిక్రమ్ ఇప్పటికే స్టోరీని బన్నీ కోసం సిద్దం చేశాడు.